Vijayawada: పెరిగిన గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసన

ABN , First Publish Date - 2022-07-07T17:09:40+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డూఆపూ లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసనకు దిగింది.

Vijayawada: పెరిగిన గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసన

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డూఆపూ లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసనకు దిగింది. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ వినూత్నంగా కుంపటితో ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టింది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అంటూ మహిళా సమైక్య ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వటం లేదని, గ్యాస్ సిలిండర్‌పై మరో 50 రూపాయలు ఏ రకంగా పెంచారని  మండిపడింది. ఒకప్పుడు రూ.400 ఉండే గ్యాస్ బండ ధర ఇప్పుడు రూ.1160 ఉందని.. ఇప్పుడు దానిపై మరో రూ.50 పెంచారని మహిళా సమైక్య ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-07-07T17:09:40+05:30 IST