ఎగరనున్న విమానాలు

ABN , First Publish Date - 2020-05-26T08:47:58+05:30 IST

రెండు నెలల తర్వాత ఎట్టకేలకు విజయవాడ విమానాశ్రయం నుంచి మంగళవారం రెగ్యులర్‌ విమాన సర్వీసులు ..

ఎగరనున్న విమానాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రెండు నెలల తర్వాత ఎట్టకేలకు విజయవాడ విమానాశ్రయం నుంచి మంగళవారం రెగ్యులర్‌ విమాన సర్వీసులు ప్రారంభమౌతున్నాయి. వాస్తవానికి నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం 7 విమాన సర్వీసులు నడవాల్సి ఉండగా 3 సర్వీసులే నడవనున్నాయి. అదీ ఒక్క సర్వీసు చెన్నైకు మాత్రమే ఖచ్చితంగా నడుపుతా మని ఏఏఐ అధికారులకు కన్ఫర్మేషన్‌ వచ్చింది. ఢిల్లీ, బెంగళూరుకు కూడా విమాన సర్వీసులున్నా యని చెబుతున్నా రాత్రి 7 గంటల వరకు ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థల నుంచి కన్ఫర్మేషన్‌ రాలేదు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతులిచ్చినా ఆదివారం ఏ సర్వీసు నడవ లేదు! రాత్రికి రాత్రే అర్థాంతరంగా విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ఏఏఐ అధికారులు విజయవాడలో ఇటీవలే ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లతో భేటీ అయ్యారు.


ఈ భేటీలో ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు, స్థానిక ఎయిర్‌లైన్స్‌ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా దేశీయంగా కొవిడ్‌ తీవ్రత పెద్దగా లేని నగరాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, చెన్నైలో కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉండ టంతో ఆ ప్రాంతాలకు పరిమితంగా నడపాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు మూడు సర్వీసులు, హైదరాబాద్‌కు ఒకటి, ఢిల్లీకి ఒకటి, కడపకు ఒకటి చొప్పున విమానాలు నడ పాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌, ఇండిగో, ట్రూజెట్‌ సంస్థలు సర్వీసులను నడుపుతున్నాయి. ఎయిర్‌ ఇండి యాకు ఢిల్లీకి నడిపే విమాన సర్వీసు అవకాశాన్ని ఇచ్చారు. స్పైస్‌ జెట్‌ సంస్థకు బెంగళూరు రూట్‌లో 2 సర్వీసులు, ట్రూజెట్థ్‌కు కడప సర్వీసు నడిపే అవకాశాన్ని ఇచ్చారు. ఇండిగోకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఒక్కొక్కటి చొప్పున మూడు సర్వీసులకు అవకాశం ఇచ్చారు.


వారం తర్వాత మరిన్ని విమానాలు

దేశీయంగా విమానాలు నడిపేందుకు తొలిదశలో తక్కువ సర్వీసులకూ అనుమతి ఇచ్చినా వారం తర్వాత మరిన్ని విమానాలకు అనుమతులు ఇవ్వ నున్నారు. రెండో దశలో హైదరాబాద్‌, ఢిల్లీరూట్లలో మరిన్ని సర్వీసులకు అనుమతులు ఇవ్వనున్నారు. తొలి దశలో విజయవాడ నుంచి విశాఖపట్నం సర్వీసుకు అనుమతి ఇవ్వలేదు. రెండో దఫాలో విశాఖ, తిరుపతికి అనుమతిచ్చే అవకాశం ఉంది.


 డొమెస్టిక్‌ టెర్మినల్‌ సిద్ధం

నేటి నుంచి దేశీయంగా విమానాల ఆపరేష న్‌ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో విజయవాడలోని నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటిం చేలా చర్యలు చేపట్టారు. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్‌ లలో మార్కింగ్‌ చేపట్టారు. సెక్యూరిటీ చెక్‌ ఇన్‌ ఏరియా, బ్యాగేజీ చెక్‌ ఇన్‌ ఏరియాతో పాటు లాం జ్‌లో కూర్చునే సీట్ల మధ్య గ్యాపింగ్‌ ఇచ్చారు. 


చార్జీలు పెరిగినా రిజర్వేషన్‌ ఫుల్‌

నేటి నుంచి విమానాల రాకపోకల సందర్భంగా ఆదివారం ఆయా విమానయాన సంస్థలు రిజర్వేష న్‌కు శ్రీకారం చుట్టాయి. రిజర్వేషన్‌కు తెరతీయ గానే టికెట్ల ధర స్వల్పంగా పెరిగినా టికెట్లు మాత్రం హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. బెంగ ళూరుకు సేవర్‌ ప్యాకేజీ రూ. 7550 ధర పలికింది.

Updated Date - 2020-05-26T08:47:58+05:30 IST