విజయవాడలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-07-16T14:53:10+05:30 IST

విజయవాడ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

విజయవాడలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు పునఃప్రారంభం

విజయవాడ: విజయవాడ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు  శుక్రవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో విజయవాడకు  స్పైస్ జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి నేటి నుంచి సర్వీసులు మొదలయ్యాయి. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం  బెంగళూరు స్పైస్ జెట్ స్వదేశీ సర్వీస్ విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది.

Updated Date - 2021-07-16T14:53:10+05:30 IST