Abn logo
Sep 17 2020 @ 08:29AM

విజయవాడ: రూ.50లక్షల దోపిడీలో వీడుతున్న మిస్టరీ

విజయవాడ: నగరంలో సంచలనం కలిగించిన రూ.50 లక్షలు దోపిడీలో మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ఇద్దరు సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు డాక్టర్ పీఆర్వో, మరొకరు తాడేపల్లికి చెందిన బైక్ మెకానిక్‌గా గుర్తించారు. చోరీలో తాడేపల్లి, విజయవాడకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్లు  తాడేపల్లికి చెందిన స్నేహితుడు అయిన బైక్ మెకానిక్‌కు ఆసుపత్రి పీఆర్వో చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మరో నలుగురితో చోరీకి స్కెచ్ చేసినట్లు పోలీసుల విచారణలో ఇద్దరు నిందితులు వెల్లడించారు.   పరారీలో ఉన్న మరో నలుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను తెలియజేసే అవకాశం ఉంది. 

Advertisement
Advertisement
Advertisement