ఉలిక్కిపడ్డ బందరు

ABN , First Publish Date - 2020-08-10T10:04:52+05:30 IST

ఒక్క సారిగా బందరు ఉలిక్కిపడింది. విజయవాడ లోని స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ సెం టర్‌లో ఆదివారం ఉదయం..

ఉలిక్కిపడ్డ బందరు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఒక్క సారిగా బందరు ఉలిక్కిపడింది. విజయవాడ లోని స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ సెం టర్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో బందరుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. వీరిద్దరూ కరోనా బారిన పడటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. స్వర్ణప్యాలెస్‌లో ఉండి చికిత్స పొందుతున్న వీరు అగ్ని ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకు న్నాయి.  కొవిడ్‌ బారి నుంచి కోలుకుని కొది ్దరోజుల్లో ఇంటికి తిరిగివస్తారని భావించగా అగ్ని ప్రమాదం రూపంలో వీరు ప్రాణాలు పోగొ ట్టుకోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 

వెండి కరిగించే పనిచేస్తూ..

మచిలీపట్నం కుమ్మరిగూడెంకు చెందిన మజ్జి గోపి (54) స్థానిక మేదరబజార్‌లో వెండి కరిగించే షాపు నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటంతో గోపీ కూడా కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. లక్షణాలేమీ లేకున్నా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దీంతో ఈనెల 5న విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రిలో చేరారు. రెండో కుమారుడు కూడా కరోనా బారినపడి స్వీ య గృహనిర్బంధంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయగా తానూ కొవిడ్‌తో ఇబ్బందులు పడుతున్నానని, తన తం డ్రి మరణవార్త తెలిసిందని, ఈ విషాద సమ యంలో ఇంతకు మించి మాట్లాడలేనని తెలి పారు. గోపీ భార్య మూడేళ్ల క్రితమే మరణించగా రక్త సంబంధీకుల గృహాలు పక్కపక్కనే ఉండటంతో వారు భోరున విలపిస్తున్నారు. గోపి మరో కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు విజయ వాడకు తరలివెళ్లారు. 


సర్కిల్‌ పేటలో కలకలం..

సర్కిల్‌పేటకు చెందిన డొక్కు శివబ్రహ్మయ్య (58) భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కం పెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తూ భార్య అరుణతో కలసి సర్కిల్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఆయనకు కుమార్తె, కుమారుడు. వివాహానం తరం వీరు విజయవాడలో ఉంటున్నారు. ఈనెల 8న డ్యూటీకి వెళ్లిన బ్రహ్మయ్య అనారోగ్యం పాలవడంతో కంపెనీవాళ్లే ఆయనను విజయ వాడకు తరలించారు. స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో బ్రహ్మయ్య మరణించాడని వార్తల్లో తెలుసుకుని ఆందోళనకు గుర య్యామని స్థానికులు చెబుతున్నారు.  మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడి మృతి


ఘంటసాల : కొడాలి గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు పొట్లూరి పూర్ణచంద్రరావు ఇటీ వల తీవ్ర అనారోగ్యానికి గురవటంతో ఈనెల 6న ఆసుపత్రిలో జాయినయ్యాడు. శ్రీకాకుళం పీహె చ్‌సీలో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న ఆయన రిజల్ట్‌కు వారం పడుతుందని వైద్యులు సూచించటంతో విజయవాడలో జాయినయ్యారు. కొవిడ్‌ రెండో స్టేజ్‌లో ఉందని, ఊపిరితిత్తుల సమస్య ఉందని వైద్యులు తెలిపినట్లు మృతుడి మనుమడు నవీన్‌ తెలిపారు. పూర్ణచంద్రరావుకు భార్య రాజ్యలక్ష్మి, కుమారులు వెంకటేశ్వరరావు, శరత్‌చంద్ర, కుమార్తె ఆశాలత ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో నెగిటివ్‌ నిర్ధారణ అయిందని శ్రీకాకుళం పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు.


కొడాలిలో విషాదఛాయలు..

పూర్ణచంద్రరావు మృతి వార్తతో కొడాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు జిల్లా ప్లా నింగ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ అనంతరం కొడాలిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామపెద్దలు పూర్ణచంద్రరావును కొడాలి పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావు అందరి మన్ననలు పొందారు.  పూర్ణచంద్రరావు మృతి పట్ల పలువురు సంతాపం, సానుభూతిని వ్యక్తపరిచారు. 

Updated Date - 2020-08-10T10:04:52+05:30 IST