Abn logo
Jun 25 2021 @ 16:34PM

విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం

విజయవాడ: నగరంలోని అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో  నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీపుటేజినీ పరిశీలిస్తున్నారు. ఈ హత్య వెనుక రమేష్ అనే రౌడీ షీటర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.