బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-05-18T13:36:48+05:30 IST

నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై పెను ప్రమాదం తప్పింది.

బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై తప్పిన ప్రమాదం

విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై పెను ప్రమాదం తప్పింది. టైర్లు పేలిపోవడంతో ఓ లారీ అదుపుతప్పి బ్రిడ్జి రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ ఫ్లై ఓవర్  పక్కన లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కాగా భారీ లారీ కావడంతో వాల్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని లారీని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


                        ఫొటోల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2021-05-18T13:36:48+05:30 IST