Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 21:44:56 IST

‘Kartavyam’కు 32 సంవత్సరాలు.. రాములమ్మ రెస్పాన్స్ ఇదే!

twitter-iconwatsapp-iconfb-icon

అప్పటి వరకు హీరోలకే ఉన్న స్టార్ ఇమేజ్‌‌ని.. హీరోయిన్లకు కూడా వచ్చేలా చేసిన చిత్రం.. విజయశాంతి (Vijayashanti) ప్రధాన పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ (Kartavyam) చిత్రం. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్‌గా మారిపోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లేడీ సూపర్ స్టార్‌ అనే ట్యాగ్‌ని పరిచయం చేసిన చిత్రం ‘కర్తవ్యం’. ఆ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి నట విశ్వరూపం చూపించారు. 1990 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం 2022 జూన్ 29 నాటికి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘కర్తవ్యం’ చిత్రం పోస్టర్స్‌తో విజయశాంతికి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానుల శుభాకాంక్షలను గమనించిన రాములమ్మ.. తన ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. 


‘‘నా కర్తవ్యం సినిమా రిలీజ్ అయి నేటికి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా..

స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన నా అభిమానులకు ధన్యవాదాలు..

‘A Film That's An Inspiration For Me Too Always’

మీ విజయశాంతి’’ అంటూ రాములమ్మ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


‘కర్తవ్యం’ విషయానికి వస్తే.. లేడీ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ కిర‌ణ్ బేడీ (Kiran Bedi) ప్రేర‌ణ‌తో ఈ సినిమాని డైరెక్టర్ మోహ‌న‌గాంధీ (Mohana Ganghi) రూపొందించారు. పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) కథ అందించగా.. ఎం.వి.శ్రీనివాస్ ప్రసాద్ (M V Sreenivaasa Prasaad) నిర్మించారు. అన్యాయాలు, అక్రమాలు చేసే రాజ‌కీయ నాయ‌కుడు ముద్దుకృష్ణయ్యకు, సిన్సియ‌ర్‌ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీకి మ‌ధ్య జ‌రిగే పోరాటమే ‘క‌ర్తవ్యం’ చిత్రం. అప్పట్లోనే ఈ చిత్రం రూ. 3 కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 

Kartavyamకు 32 సంవత్సరాలు.. రాములమ్మ రెస్పాన్స్ ఇదే!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement