రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలి: Vijayashanthi

ABN , First Publish Date - 2022-07-15T03:46:57+05:30 IST

హైదరాబాద్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు.

రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం చెల్లించాలి:  Vijayashanthi

హైదరాబాద్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని BJP సీనియర్ నాయకురాలు Vijayashanthi డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. KCR స‌ర్కార్ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని ఆమె ఆరోపించారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమ‌లు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌కరమని ఆరోపించారు. 




ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఉందని, 14వ తేదీ వచ్చినా 18 జిల్లాల్లో ఉద్యోగులకు శాలరీలు అందలేదని రాములమ్మ ఆరోపించారు. పెన్షన్ల పరిస్థితీ అలాగే ఉందని.. ఈఎంఐలు కట్టలేకపోతున్నామంటూ ఉద్యోగులు వాపోతున్నారని Vijayashanthi చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బందులు ప‌డుతున్నారని తెలిపారు. ఇప్ప‌టికైనా వారికి జీతాలు, పెన్ష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.



Updated Date - 2022-07-15T03:46:57+05:30 IST