ABN Desk: ట్విట్టర్(Twitter)లో విజయసాయి రెడ్డి (Vijayasai reddy), రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju)ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రఘురామపై విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. అసభ్యపదజాలంతో దూషించారు. అయితే విజయసాయికి రఘురామ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయిని ఎన్ని తన్నులు తన్నినా సిగ్గుండదని ట్వీట్ చేశారు. అనర్హతవేటుపై చేతులెత్తేసి, కొత్తగా రాజీనామా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ ట్వీట్లో తాను ఏపీకి వస్తే సీఎం మైండ్ బ్లాంక్ అవుద్దనే కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాగా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు నిరసనసెగ తగులుతోంది. పరుచూరు వైసీపీ ఇన్చార్జ్ రామనాథంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సమస్యలపై జనం నిలదీశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని జనం చుట్టుముట్టారు. గ్రామంలో రహదారులు, కాలువలు అద్వానంగా ఉన్నాయంటూ సమస్యలను ఏకరువుపెట్టారు. దీంతో సమాధానం చెప్పలేక రామనాథం బాబు అక్కడి నుంచి జారుకున్నారు.
ఇవి కూడా చదవండి