ట్విట్టర్‌లో విజయసాయి వర్సెస్ దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-07-11T20:37:39+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నెలకొంది.

ట్విట్టర్‌లో విజయసాయి వర్సెస్ దేవినేని ఉమ

అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నెలకొంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాస్తవాలు చెబుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తారా..? అని అధికార పార్టీని టీడీపీ నేతలు ప్రశ్నించగా.. అందుకు విజయసాయి రెడ్డి కౌంటరిచ్చారు. ఇందుకు తాజాగా దేవినేని ట్విట్టర్ వేదికగా స్పందించి ఒకింత హెచ్చరించారు. ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్‌ ఏంటో చూద్దాం.


దేవినేని ఉమ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు!

వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సిఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి అని ప్రాజెక్టుల విషయమై విజయసాయి ట్వీట్ చేశారు. కాగా.. గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా పనిచేసిన దేవినేని ఈ ట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు.


బెదిరింపులు ఆపు!

ఇరిగేషన్‌ను దేశంలో 2వస్థానంలో నిలబెట్టాం. కారు దింపిన తర్వాత ఫ్రస్టేషన్‌లో పడ్డావ్. 108అంబులెన్సుల్లో 307కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు ఊసలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకి భయపడం. జైలు నుంచి బెయిల్‌పై వచ్చావ్ ఒళ్ళు సోయిలో పెట్టుకో.. బెదిరింపులు ఆపు జర భద్రంఅని విజయసాయిని మాజీ మంత్రి దేవినేని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. కాగా వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్ల అటు టీడీపీ.. ఇటు వైసీపీ, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2020-07-11T20:37:39+05:30 IST