AP News: ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2022-09-10T21:50:37+05:30 IST

Amaravathi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేర్చడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్‌చంద్ర శేషు స్పందించారు.

AP News: ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా : ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో ఎంపీ విజయ్ సాయి రెడ్డి (MP Vijayasai Reddy) అల్లుడు సృజన్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేర్చడంపై తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్‌చంద్ర శేషు స్పందించారు. ఈ స్కాంలో స‌ృజన్ రెడ్డి పాటు జగతి పబ్లికేషన్స్ యజమాని, ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి (Bharati Reddy)కి కూడా లింక్ ఉందనే అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. 


‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి కూడా లింకులున్నాయని ఇటీవల వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులో ఈడీ చేసిన తనిఖీల్లో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నాడని తెలిపింది. ఇప్పడు విజయసాయి రెడ్డి  ఏం సమాధానం చెబుతాడో మరి?.. అవినీతే ధ్యేయంగా ..అక్రమార్చనే లక్ష్యంగా..ఎదుటి వారి మీద నిత్యం తప్పుడు ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డి ..ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తన దొంగ లెక్కల తెలివితేటలతో అవినీతికి పాల్పడటం దురదృష్టకరం. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకపక్క మన రాష్ట్రాన్ని లూటీ చేస్తూ మరోపక్క పక్క రాష్ట్రాల్లో కూడా అవినీతికి పాల్పడడం అత్యంత హేయమైన  చర్య. సృజన్ రెడ్డి తన అక్రమాస్తులను జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. దానికి యజమాని సీఎం జగన్ (CM Jagan) భార్య భారతి రెడ్డి కావడం వల్ల ఆమె ఆస్తులపై అలాగే.. జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-09-10T21:50:37+05:30 IST