విశాఖ: నగరంలో ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన షాక్ ఇచ్చింది. జీవీఎంసీ 31వ వార్డులో ఉమెన్స్ కాలేజ్ పోలింగ్ కేంద్రం దగ్గర విజయసాయిరెడ్డిని జనసేన శ్రేణులు అడ్డుకున్నారు. విజయసాయిని ఎలా అనుమతిస్తారంటూ అధికారులను జనసేన నేతలు నిలదీశారు. జనసేన ఆందోళనతో విజయసాయిరెడ్డి అక్కడ నుంచి వెనుదిరిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.