విశాఖ (Visakha): ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్నా.. ఎవరు అవునన్నా.. కాదన్నా విశాఖ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ (Executive Capital) అవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తలకిందులుగా తపస్సు చేసినా దీన్ని ఆపే శక్తి ఆయనకు లేదన్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఆలస్యమైందన్నారు. తప్పకుండా ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు మారుతుందని విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి