దేవదాయ శాఖ ఆర్జేసీగా విజయసాగర్‌ బాబు

ABN , First Publish Date - 2021-03-04T07:37:22+05:30 IST

తిరుపతి దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనరుగా అదే శాఖలో డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న విజయసాగర్‌ బాబు నియమితులయ్యారు.

దేవదాయ శాఖ ఆర్జేసీగా విజయసాగర్‌ బాబు

కలికిరి, మార్చి 3: తిరుపతి దేవదాయ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనరుగా అదే శాఖలో డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న విజయసాగర్‌ బాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్జేసీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, కాణిపాకం ఆలయ ఈవో ఏ.వెంకటేశును ఆ బాధ్యతల నుంచి తప్పించి విజయసాగర్‌ బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన రోజువారీ వ్యవహారాలపై కొన్ని పరిమితులు విధించారు. బడ్జెట్‌కు లోబడిన మంజూరులు, నిధులు విత్‌డ్రా చేయడం, అద్దెలు, లైసెన్సులు, టెండర్లు ఖరారు చేయడం, రూ.2 నుంచి రూ.10 లక్షల మధ్య ఇంజనీరింగ్‌ పనులకు ఆమోదంలాంటి వాటికి దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనరు ముందస్తు అనుమతులు పొందాలని నిర్దేశించారు.

Updated Date - 2021-03-04T07:37:22+05:30 IST