Abn logo
Aug 3 2021 @ 23:49PM

లాంచీస్టేషన్లో మద్యం దుకాణం ఏర్పాటు

దుకాణంలో మద్యం సర్దుతున్న దృశ్యం

విజయపురిసౌత్‌, ఆగస్టు 3:  పర్యాటక కేంద్రమైన విజయపురిసౌత్‌లోని లాంచీ స్టేషన్లో మంగళవారం ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల్లో మద్యం షాపులకు లైసెన్సులు మంజూరు చేసింది. లాంచీస్టేషన్‌ పక్కనే వరుసగా ఆలయాలు ఉండడం, ఎదురుగానే పర్యాటకశాఖ హోటల్‌లో బార్‌, రెస్టారెంట్‌ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో చోటికి మద్యం షాపును తరలించాలని ఎస్‌ఈబీ అధికారులకు వినతిపత్రం అందించారు.