విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-09-06T15:56:43+05:30 IST

విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడ దుంకుతున్నాయి. మెంటాడ మండలంలో భారీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడ దుంకుతున్నాయి. మెంటాడ మండలంలో భారీ వర్షానికి పోరం-జక్కువ ప్రధాన రహదారి తెగిపోయింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంట చేనులు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు చేతికి వచ్చిన పంట నీట మునగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T15:56:43+05:30 IST