అమరావతి: తన వెంట నడిచేవారిని సీఎం జగన్ (CM Jagan) నట్టేట ముంచారని టీడీపీ నేత జీవీరెడ్డి (GV Reddy) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు వైఎస్ విజయమ్మ (YS Vijayamma) హామీలు ఇచ్చారని తెలిపారు. ఆ హామీలు నెరవేర్చ లేదని, హామీలు ఇచ్చిన ఆమెను తప్పించారని తప్పుబట్టారు. దీనికి వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అక్కచెల్లెమ్మలంటూ ఆడబిడ్డలనూ ముంచేందుకు జగన్ వెనకాడని జీవీరెడ్డి విమర్శించారు.
జగన్ దృష్టిలో కుటుంబీకులకు విలువ లేదని సీపీఎం నేత గఫూర్ విమర్శించారు. జగన్‌ను సీఎం చేసేందుకు బైబిల్ పట్టుకుని విజయమ్మ రాష్ట్రమంతా తిరిగారని గుర్తుచేశారు. తల్లిని పార్టీ నుంచి తప్పించడం దారుణమన్నారు. ఇది కృతజ్ఞతా.. కృతఘ్నతా అని గఫూర్ వ్యాఖ్యానించారు.
విజయమ్మను సాగనంపేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలతో విజయమ్మ హైదరాబాద్‌లో ఉంటోంది. షర్మిల పార్టీకి ఆమె పెద్దదిక్కుగా ఉన్నారు. విజయమ్మతో రాజీనామా చేయించేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలివిగా వైసీసీ గౌరవ అధ్యక్షురాలి స్థానం నుంచి తప్పించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీని జగన్ సాకుగా చూపుతున్నారు. విజయమ్మనే స్వయంగా రాజీనామా చేసేలా జగన్ ఎత్తుగడ వేస్తున్నారు. విజయమ్మతో రాజీనామా చేయించేలా జగన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు విజయమ్మకు జగన్ నేరుగా సమాచారం ఇవ్వలేదు. లేఖ ద్వారా విజయమ్మకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి