YCP గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నా: Vijayalakshmi

ABN , First Publish Date - 2022-07-08T18:54:18+05:30 IST

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని విజయలక్ష్మి ప్రకటించారు.

YCP గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నా: Vijayalakshmi

Mangalagiri (గుంటూరు జిల్లా): వైసీపీ (YCP) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్లీనరీ (Plenary) సమావేశాల్లో విజయలక్ష్మి (Vijayalakshmi) ప్రకటించారు. పార్టీ సభ్యత్వం నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాణ (Telangana)లో వైఎస్ షర్మిల (Sharmila) ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. అయితే తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని విజయలక్ష్మి స్పష్టం చేశారు. జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారని, తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ అభిమానులు క్షమించాలని విజయలక్ష్మి కోరారు.


జగన్‌, షర్మిలకు ఎల్లప్పుడూ అండగా ఉన్నానని విజయలక్ష్మి అన్నారు. ఏపీలో తన సోదరుడు జగన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన అందించడానికే షర్మిల పోరాటం చేస్తోందని విజయలక్ష్మి అన్నారు. ఆమెకు అండగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-08T18:54:18+05:30 IST