Sep 23 2021 @ 01:08AM

విజయదశమికి డాక్టర్‌

శివ కార్తికేయన్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాక్టర్‌’. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాత కోటపాడి జె. రాజేశ్‌ తెలిపారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. ప్రస్తుతం విజయ్‌తో ‘బీస్ట్‌’ చేస్తున్నా’’ అని దర్శకుడు తెలిపారు. కోటపాడి జె. రాజేశ్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో డాక్టర్‌ వరుణ్‌గా  శివ కార్తికేయన్‌ కనిపిస్తారు. గతంలో ఆయన నటించిన ‘శక్తి’ని మేం తెలుగులో విడుదల చేశాం. ఇప్పుడు ‘డాక్టర్‌’ విడుదల చేస్తున్నాం. తమిళంలోనూ అక్టోబర్‌ 9న విడుదలవుతోంది. తమిళంలో పాటలకు మంచి స్పందన లభించింది. త్వరలో తెలుగు పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు.