విజయాలకు ప్రతీక విజయదశమి

ABN , First Publish Date - 2020-10-25T06:11:28+05:30 IST

దసరా ఉత్సవాలకు ప్రజలు సిద్ధమయ్యారు. ఊరువాడ ల్లో దసరా సంబరాల కోలాహలంతో సందడి నెలకొంది. ఆశ్వయుజ శుద్ద పాఢ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు, పదవ రోజు విజయ దశమిని జరుపుతారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ.

విజయాలకు ప్రతీక విజయదశమి

నేడే దసరా పర్వదినం 

పలు చోట్ల శమీ పూజలు


నస్పూర్‌, అక్టోబరు 24 : 

దసరా ఉత్సవాలకు ప్రజలు సిద్ధమయ్యారు. ఊరువాడ ల్లో దసరా సంబరాల కోలాహలంతో సందడి నెలకొంది. ఆశ్వయుజ శుద్ద పాఢ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు, పదవ రోజు విజయ దశమిని జరుపుతారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. మొదటి మూడు రోజులు పార్వతీదేవిని, తరువాత మూడు రోజులు లక్ష్మిదేవిని, మరుసటి మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు ఆనవాయితీగా చేస్తూ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేస్తారు. విజయదశమి రోజు దుర్గపూజ నిర్వహిస్తారు. విజయ దశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసు డితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి రాక్షసుడిని వధించి జయాన్ని సాధించిన సందర్భంగా పదవ రోజు ప్రజలం దరూ వేడుకలను జరుపుకుంటారు. ఉద్యోగాల రీత్యా పట్ట ణాలకు వలస వెళ్ళిన వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. వస్త్ర దుకాణాలతో పాటు మద్యం షాపులు, మేకల మండీల వద్ద కొనుగోళ్ళు జోరందుకున్నా యి.  


పాలపిట్ట దర్శనం..

దసరా వేడుకల సందర్భంగా పాలపిట్టకు ప్రాధాన్యం ఉన్నది. పాలపిట్ట శుభాలకు, విజయాలకు, చిహ్నంగా భావిస్తారు. దశమి రోజున పాలపిట్టను చూడడానికి అదృష్టంగా, శుభ సూచకంగా భావించి చూసే ప్రయత్నం చేస్తారు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగిం చుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపిం చిందని, అనాటి నుంచి వారికి విజయాలు చేకూరాయని నమ్మకం. 


జమ్మి పూజ

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సా యంత్రం జమ్మి పూజ జరుగుతుంది. ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి దసరా సంబరాలను జరుపుకుని జమ్మి పూజకు వెళుతారు. సాయంత్రం జరిగే శమీ (జమ్మి చెట్టు) పూజలో పాల్గొని జమ్మి ఆకులను తీసుకుని బం గారంగా పిలుచుకునే ఆకులను కుటుంబ పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకోవడం,  స్నేహితులను కలిసి అలాయ్‌ బలాయ్‌ చేసుకుని దసరా సంబరాలను  జరుపుకుంటారు. మహాభారతంలో పాండవులు అజ్ఞాత వాసం ఆరంభంలో వారి వద్ద ఉన్న ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం ముగిసిన తరు వాత  ఆర్జుణుడు శమీ వృక్షానికి పూజా చేసి గాండీవాన్ని అందుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా జమ్మి చెట్టు ప్రాధాన్యం చేకూరిందని పండితులు పేర్కొంటున్నారు.  


మద్యం, మాంసం...

దసరా వేడుకల్లో భాగంగా మద్యం, మాంసంకే ఎక్కు వ ప్రాధాన్యం కల్పిస్తారు. కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలు ధరిస్తారు. దసరా సందర్భంగా బట్టల వ్యాపారు లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రాయితీలు కల్పిస్తారు. పలు వ్యాపార సముదాయలు జనం సంద డితో కోలాహలంగా మార్కెట్‌ కనిపిస్తోంది. మద్యం, కోళ్ళు, మేకలు విపరీతంగా అమ్మకాలు జరుగుతాయి. 

Updated Date - 2020-10-25T06:11:28+05:30 IST