మింగ మెతుకు లేకున్నా ఆర్భాటాలు చేస్తున్న కేసీఆర్ సర్కార్:Vijaya shanti

ABN , First Publish Date - 2022-06-04T02:19:06+05:30 IST

మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె... అన్నట్లు రాష్ట్ర ఖజానాలో పైసల్లేకున్నా కేసీఆర్ సర్కార్(kcr govt) మాత్రం ఆర్భాట ప్ర‌చారాలు ప్రదర్శిస్తోందని సీనియర్ బిజెని నాయకురాలు విజయశాంతి(vijaya shanti) విమర్శించారు.

మింగ మెతుకు లేకున్నా ఆర్భాటాలు చేస్తున్న కేసీఆర్ సర్కార్:Vijaya shanti

హైదరాబాద్: మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె... అన్నట్లు రాష్ట్ర ఖజానాలో పైసల్లేకున్నా కేసీఆర్ సర్కార్(kcr govt) మాత్రం ఆర్భాట ప్ర‌చారాలు ప్రదర్శిస్తోందని సీనియర్ బిజెని నాయకురాలు విజయశాంతి(vijaya shanti) విమర్శించారు. ఒకపక్క ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు పైసల్లేకున్నా ప్ర‌చారానికి మాత్రం డబ్బు నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నారని శుక్రవారం ఆమె ఫేస్ బుక్ పోస్ట్ లోపేర్కొన్నారు.  ఉద్యోగులకు జిల్లాకో రోజు చెల్లింపు ముహూర్తాలు పెడుతున్న ఈ ప్రభుత్వం...సొంత పబ్లిసిటీకి మాత్రం కోట్లాది రూపాయలు కుమ్మరించిందన్నారు. రాష్ట్ర ప్రజల వందల కోట్ల సొమ్మును... దేశమంతటికీ దర్జాగా పప్పు బెల్లాలు పంచినట్టు  ఖర్చుపెట్టిందన్నారు. 


గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న పత్రికలు, టీవీల అడ్వర్టయిజ్​మెంట్లకు భారీగా ఖర్చు చేసింది. జేబులో చిల్లిగవ్వ లేకున్నా పబ్లిసిటీకి ప్రభుత్వం పెట్టిన ఈ ఖర్చు చూస్తే విస్మయం క‌లుగుతోందని విజయశాంతి ఆరోపించారు. పార్టీ ప్ర‌చారానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నరు. సొంత మీడియాతో పాటు రాష్ట్రంలో తమకు నచ్చిన పేపర్లకు పేజీల కొద్దీ యాడ్స్ ఇచ్చుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ తమ పబ్లిసిటీ అతిని ప్రదర్శించుకుంటోందని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయి ఇంగ్లిష్ న్యూస్ పేపర్లతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ ప్రాంతీయ భాషా పేపర్లలోనూ ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. కేసీఆర్... ఈ ఆర్భాట ప్ర‌చారాలు అవ‌స‌రమా? ఎంత భారీ ప్రచారం చేసినా... మీ ద‌గాకోరు కబుర్లను ప్ర‌జ‌లు నమ్మరు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా త‌గిన రీతిన బుద్ధి చెబుతారని విజయశాంతి పేర్కొంది.

Updated Date - 2022-06-04T02:19:06+05:30 IST