విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయాలి

ABN , First Publish Date - 2020-06-03T19:58:42+05:30 IST

విజయా ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని వాటిని మరింతగా వారికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయాలి

హైదరాబాద్‌: విజయా ఉత్పత్తులకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని వాటిని మరింతగా వారికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. విజయా నుంచి మరిన్ని  ఉత్పత్తులు తయారు చేయాలన్నారు. బుధవారం లాలాపేటలోని డెయిరీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బ్యాటరీతో నడిచే 15 మొబైల్‌ ఔట్‌లెట్‌  వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ విజయా డెయిరీకిమరింత ఎక్కువ లాభాలు రావాలంటే డెయిరీ ఉత్పత్తులకు మరింత ఎక్కువ ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందనారు  విజయా డెయిరీ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్దతో ఉన్నారని తెలిపారు. ప్రజలకు విజయా ఉత్పత్తులను చేరువ చేసేందుకు మరిన్ని ఔట్‌లెట్స్‌ను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రయివేటు డెయిరీలకు ధీటుగా విజయ డెయిరీని అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నగరంలో బ్యాటరీతో నడిచే 100 మొబైల్‌ ఔట్‌లెట్‌ల ద్వారా విజయ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నామని అన్నారు దీనిని భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా  1000 వరకూ పెంచుతామన్నారు. ఈ వాహనం ఒక్కోటి 2.25 లక్షల రూపాయలు కాగా ఇందులో డెయిరీ 30శాతం, లబ్ధిదారుడు 70శాతం భరించాలన్నారు. నూతన ఔట్‌లెట్‌ల ఏర్పాటుతో విజయా విక్రయాలను పెంచడంతో పాటు నిరుద్యోగులలకు ఉపాధి కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. హైవేలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు తదతర ప్రాంతాల్లో నెల రోజుల్లోనే మరో 500 కొత్త ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. .దేశంలో విజయ డెయిరీని అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు. 

Updated Date - 2020-06-03T19:58:42+05:30 IST