Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 14 Aug 2022 14:58:48 IST

Vijay Sethupathi: ఒక్క ట్వీట్‌తో ఫుల్లు క్లారిటీ.. బన్నీ ‘పుష్ప 2’, షారూఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తున్నాడన్న వార్తలపై..

twitter-iconwatsapp-iconfb-icon

విభిన్న పాత్రలు, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). అభిమానులందరు ముద్దుగా  మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటుంటారు. ‘విక్రమ్ వేద’, ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఏ పాత్రను అయినా విజయ్ అలవోకగా పోషిస్తాడు. తన నటనతో అభిమానులను ఫిదా చేస్తాడు. అందువల్ల మక్కల్ సెల్వన్‌తో సినిమాలు చేయడానికీ మేకర్స్ అందరు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ సేతుపతి పలు చిత్రాల్లో నటిస్తున్నాడని ఈ మధ్య పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ వదంతులపై తాజాగా అతడి పీఆర్‌వో స్పందించాడు.  


అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ (Pushpa) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100కోట్ల వసూళ్లను రాబట్టింది. ఫలితంగా ‘పుష్ప: పార్ట్-2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండో భాగంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని గత కొంతకాలంగా వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ విజయ్ పీఆర్‌వో ఓ ట్వీట్ చేశాడు. విజయ్ సేతుపతి ఎటువంటి తెలుగు సినిమా చేయడం లేదని తెలిపాడు. కానీ, షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటిస్తున్న ‘జవాన్’ (Jawan)లో విలన్ పాత్రను పోషిస్తున్నట్టు ధ్రువీకరించాడు. ‘జవాన్’ కు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌‌గా చేస్తుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రను రానా దగ్గుబాటి పోషించాలి. కానీ, ఆరోగ్య కారణాల రీత్యా రానా ఈ మూవీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో షారూఖ్ ఖాన్ ఈ పాత్రను చేయాలని స్వయంగా విజయ్‌ను కోరాడు. ఫలితంగా ఈ సినిమాను అంగీకరించాడు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement