Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 18 Jan 2022 09:06:35 IST

‘భగత్‌సింగ్‌’ కు విలన్ గా మక్కళ్ సెల్వన్?

twitter-iconwatsapp-iconfb-icon
భగత్‌సింగ్‌ కు విలన్ గా మక్కళ్ సెల్వన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లానాయక్ , హరిహర వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు పవర్ స్టార్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రానికి కూడా కమిట్‌మెంట్ ఇచ్చారు. త్వరలోనే చిత్రం సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. గతేడాది ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్ళీ పవన్, హరీశ్ కాంబో రిపీట్ అవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్లియర్ గా వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేశ్’ తీసి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న హరీశ్ శంకర్..‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాన్ని అభిమానులు కోరుకొనే అన్ని అంశాలతో తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా నటిస్తున్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాలో పవర్ స్టార్ ని ఢీకొట్టడానికి ఓ పవర్ ఫుల్ విలన్ ను సెట్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 


తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ‘భవదీయుడు భగత్‌సింగ్’ లో ‘మాస్టర్, ఉప్పెన’ చిత్రాల్ని మించే స్థాయిలో విలనిజాన్ని ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రను ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారట దర్శకుడు హరీశ్ శంకర్. దానివల్లనే ఇందులో నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రానికి విజయ్ సేతుపతి విలనిజం ఏ స్థాయిలో హైలైట్ కానుందో చూడాలి.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement