Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 28 Jun 2022 14:22:29 IST

Pushpa 2 : పవర్‌ఫుల్ పాత్రలో విలక్షణ నటుడు ?

twitter-iconwatsapp-iconfb-icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప :  ది రైజ్’ (Pushpa the rise) పాన్ ఇండియా చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళు సాధించి.. కొత్త రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ పుష్ప కేరక్టరైజేషన్.. ప్రేక్షకులకు మ్యానియాగా మారింది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, అలాగే.. సినిమా కథాంశం విషయంలో వచ్చిన విమర్శల్ని పరిగణనలోకి తీసుకుని సుకుమార్ అండ్ టీమ్.. స్ర్కిప్ట్ లో అవసరమైన మార్పులు చేస్తున్నారు. ఇంకా.. రెండో భాగం కోసం ప్రేక్షకులకు వరుస సర్ ప్రైజుల్ని సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రకోసం తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని ఎంపిక చేశారని టాక్.

మొదటి భాగం చివరిలో భన్వర్ సింగ్ షకావత్ పాత్రను ఎంటర్ చేసి..  ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేసిన దర్శకుడు సుకుమార్ (Sukumar).. రెండో భాగంలోనూ అదే మ్యాజిక్ ను కంటిన్యూ చేయబోతున్నారు.  భన్వర్ సింగ్, పుష్ప పాత్రల మధ్య విరోధమే ప్రధానంగా రెండో భాగం ఉండనుందట. అలాగే.. విజయ్ సేతుపతి పాత్రతో సినిమాకి మరింతగా ఇంటెన్సిటీని క్రియేట్ చేయబోతున్నారట. ఇందులో అతడో సీనియర్  పోలీసాఫీసర్ గా నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ స్ర్కిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. కొద్దిరోజుల క్రితం.. సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమా లొకేషన్స్ ను ఫైనల్ చేయడానికి వెళ్లారట. సునీల్, అనసూయ, ధనుంజయ పాత్రలు రెండో భాగానికి మరింత కీలకం కాబోతున్నాయట. 

రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతుండగా... ఇందులో ఆమె పాత్ర చనిపోతుందనే వార్తల్ని ఖండించారు మేకర్స్. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) మ్యూజికల్ మ్యాజిక్ ఈ భాగంలోనూ కొనసాగనుంది. ఇందులో కూడా ఒక అదరిపోయే ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. అలాగే.. మొదటి భాగాన్ని మించే స్థాయిలో పాటలు ఉండనున్నాయని టాక్. సాధారణ గంధపు చెక్కల కూలి.. సిండికేట్ కు బాస్ గా ఎదిగడం మొదటి భాగమైతే.. తన సామ్రాజ్యాన్ని ఎలా ఏలబోతాడు అన్నది రెండో భాగం కథాంశం. ఆ క్రమంలో పుష్ప రాజ్ ఎదుర్కొన్న సవాళ్ళు.. సినిమాకే హైలైట్ కానున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement