ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 65వ చిత్రం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానరుపై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుంటే, హీరో విజయ్ తన 66వ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మితమవుతుంది.
అయితే, ఇందులో ‘ఎరోటోమేనియా’ అనే వ్యాధితో బాధపడే మానసిక రోగి పాత్రను విజయ్ పోషించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అనేక మంది కోలీవుడ్, టాలీవుడ్ అగ్ర నటీనటులు నటించనున్నట్టు సమాచారం. కానీ, నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, ‘బీస్ట్’ షూటింగ్ ముగిసిన వెంటనే మార్చిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.