Apr 16 2021 @ 23:16PM

థియేటర్లలోకి విజయ రాఘవన్‌

విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే తమిళ నటుడు విజయ్‌ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు విజయ్‌ ఆంటోని ట్విట్టర్లో ప్రకటించారు. ‘ప్రపంచవ్యాప్తంగా అందరం మే 14న థియేటర్లలో కలుద్దాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో ఆత్మిక కథానాయికగా నటిస్తున్నారు. ఆనందకృష్ణ దర్శకుడు. నివాస్‌ కె ప్రసన్న సంగీతం అందించారు. టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌ కుమార్‌ నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘విజయ రాఘవన్‌’ చిత్రం విడుదలవుతోంది.