Abn logo
Aug 11 2020 @ 20:08PM

మొక్కలు నాటడంలో ఎంత అశ్రద్ధతో ఉన్నామంటే.. : విజయ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు స్టార్ హీరో ఇలయదళపతి విజయ్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విసిరిన ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన విజయ్, కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర హీరో. ఆయన మంగళవారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. 


ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు దేశంలోని ప్రముఖులందరూ భాగస్వాములవుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో సగటున ఒక మనిషికి కావాల్సిన ఆక్సిజన్‌కు సరిపడే మొక్కలు లేవు. అందువల్ల దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడంలో ఎంత అశ్రద్ధ చూపుతున్నామో తెలియడానికి నిదర్శనం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు, మనం అభిమానించే వాళ్లు మొక్కలు నాటే విధంగా కోరడం, ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం జరుగుతుంది. మొక్కలు నాటడంపైన, పర్యావరణ పరిరక్షణపైన మంచి అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమానికి నామినేట్ చేసిన మహేష్ బాబుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైన కార్యక్రమమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను..’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement