Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 23 Jan 2022 16:30:57 IST

‘బీస్ట్’ కోసం విజయ్ డేరింగ్ డెసిషన్

twitter-iconwatsapp-iconfb-icon
బీస్ట్ కోసం విజయ్ డేరింగ్ డెసిషన్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం ‘బీస్ట్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కిడ్నాప్ నేపథ్యంలో థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది. తెలుగులో అదే పేరుతో విడుదల కాబోతోంది ‘బీస్ట్’. ఇంతకు ముందు విజయ్ ‘మాస్టర్’ మూవీతో టాలీవుడ్ లోనూ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే అందులో విజయ్ కు వేరే వారు డబ్బింగ్ చెప్పారు. ‘బీస్ట్’ మూవీలో మాత్రం విజయ్ తొలిసారిగా తెలుగులో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోనున్నాడని సమాచారం.


ఆల్రెడీ విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగులో స్ట్రైట్ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీకి ‘బీస్ట్’ డబ్బింగ్ ప్రిపరేషన్ లా ఉంటుందని విజయ్ భావిస్తున్నాడట. ఈ మూవీకి వచ్చిన స్పందనను బట్టి.. వంశీ పైడిపల్లి సినిమాకి డబ్బింగ్ చెబుతాడట విజయ్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ‘బీస్ట్’ సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. మరి నిజంగానే ‘బీస్ట్’ కోసం విజయ్ సాహసం చేస్తాడేమో చూడాలి.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement