Bangalore రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌ను కలిసిన Vijay Mallya

ABN , First Publish Date - 2022-06-22T14:31:59+05:30 IST

బెంగళూరు (Bangalore) రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌ను కలిసిన విజయ్ మాల్యా (Vijay Mallya) కలిసిన ఘటన...

Bangalore రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌ను కలిసిన Vijay Mallya

లండన్ (యూకే): బెంగళూరు (Bangalore) రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌ను కలిసిన విజయ్ మాల్యా (Vijay Mallya) కలిసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రారంభంలో మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యాజమాన్యంలో ఉండేది. వెస్టిండీస్ ఓపెనర్ అయిన క్రిస్ గేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు కోసం ఆడి సంచలనం సృష్టించారు. బ్యాంకులను మోసగించిన విజయ్ మాల్యా తన మాజీ స్నేహితుడైన ప్రముఖ క్రికెటర్ గేల్‌తో సమావేశమైన తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చిత్రాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్‌ను కలుసుకోవడం బాగుంది. నేను అతన్ని ఆర్సీబీ జట్టులోకి రిక్రూట్ చేసినప్పటి నుంచి సూపర్ స్నేహం ఏర్పడింది. అత్యుత్తమ ఆటగాడిని కొనుగోలు చేశాను’’ అని మాల్యా ట్విట్టర్‌లో రాశారు. 


గేల్ 2011లో ఆర్సీబీ (RCB)లో చేరారు. 2017 వరకు ఫ్రాంచైజీ కోసం ఆడారు. గేల్ ఆర్సీబీ జట్టులో ఉన్న సమయంలో లీగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. గేల్ 91 గేమ్‌లలో 43.29 సగటుతో, 154.40 స్ట్రైక్ రేట్‌తో 21 అర్ధసెంచరీలు,5 సెంచరీలతో సహా 3420 పరుగులు చేశాడు. గేల్ ఆర్సీబీ కోసం ఆడుతున్నప్పుడు సంచలనాత్మక 175 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు.క్రిస్ గేల్ ఇటీవల యునైటెడ్ స్టేట్స్‌లో మరో మాజీ టీమ్ యజమాని ప్రీతి జింటాను కూడా కలిశారు. 2019లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ మాల్యాను భారత్‌కు పంపాల్సి ఉంది.భారతదేశం, యూకే దేశాలు 1992లో మాల్యా అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి.మాల్యా భారతదేశంలో మోసం మరియు మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.మాల్యా  యూకేలో బెయిలుపై రహస్య జీవితం గడుపుతున్నారు. 


Updated Date - 2022-06-22T14:31:59+05:30 IST