‘త్వరలో కెప్టెన్‌ విజయకాంత్ డిశ్చార్జి’

ABN , First Publish Date - 2020-09-30T14:44:05+05:30 IST

కరోనా తాకిడి గురై చికిత్స కోసం చేరిన డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఆరోగ్యం కుదుటపడు తోందని, త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని మియాట్‌ ఆసుపత్రి నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం

‘త్వరలో కెప్టెన్‌ విజయకాంత్ డిశ్చార్జి’

చెన్నై : కరోనా తాకిడి గురై చికిత్స కోసం చేరిన డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఆరోగ్యం కుదుటపడు తోందని, త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని మియాట్‌ ఆసుపత్రి నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం ఓ ప్రకటన జారీ చేశారు. విజయకాంత్‌ సోమవారం సాయంత్రం డిశ్చార్జ్‌ అవుతారని ఆయన బావమరిది ఎల్కే సుదీష్‌  ప్రకటించారు. కానీ ఆ ప్రకారం విజయకాంత్‌ డిశ్చార్జ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్వాహకులు విజయకాంత్‌ క్రమంగా కోలుకుంటు న్నారని, వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతోందని తెలిపారు. వైద్య నిపుణులు ఆయనకు మెరుగైన చికిత్సలందిస్తున్నారని, త్వరలోనే ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-30T14:44:05+05:30 IST