Abn logo
Jul 6 2020 @ 00:36AM

విజయ్‌ ఇంట్లో బాంబ్‌

తమిళ హీరో విజయ్‌ ఇంటి వద్ద శనివారం రాత్రి హైడ్రామా జరిగింది. విజయ్‌ ఇంట్లో బాంబ్‌ ఉందని ఓ అజ్ఞాతవ్యక్తి చేసిన ఫోన్‌ కాల్‌ చెన్నై పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అర్ధరాత్రి విజయ్‌ ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. బాంబ్‌ దొరకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమకు ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరా? అని ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలో రజనీకాంత్‌ ఇంటిలో బాంబ్‌ పెట్టినట్లు వార్తలు రాగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ఫోన్‌ చేసింది ఓ మానసిక రోగి అని తెలుసుకున్న పోలీసులు అతన్ని వదిలిపెట్టారు. 


Advertisement
Advertisement
Advertisement