Abn logo
Apr 10 2020 @ 14:46PM

నిరాశలో విజ‌య్‌ అభిమానులు

కరోనా ప్రభావం లేకుండా అంతా సవ్యంగా ఉండి ఉంటే ఇప్పుడు కోలీవుడ్‌లో విజయ్‌ అభిమానుల హంగామా కనిపించేది. తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్‌ 10న ‘మాస్టర్‌’ను విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకారమే షూటింగ్‌ ముగించి, పోస్టు ప్రొడక్షన్‌ పనులను కూడా పూర్తి చేశారు. ఆడియో కూడా విడుదలైంది. ఇక వెండితెరపై ‘మాస్టర్‌’ హంగామాను చూడాలని విజయ్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దురదృష్టశాత్తూ కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయి, థియేటర్లు మూతతపడడంతో ‘మాస్టర్‌’ విడుదల కూడా ఆగిపోయింది. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సోషల్‌ మీడియాలో తమ నిరాశని కూడా వ్యక్తపరుస్తున్నారు. ‘ఈపాటికి థియేటర్‌లో హంగామా చేస్తూ ఉండాల్సిన వాళ్లం. కానీ, కరోనా వల్ల ఇంట్లో బందీలైపోయాం’ అంటూ పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇకపోతే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి థియేటర్లు మళ్లీ తెరచే పరిస్థితులు ఏర్పడితే తొలుత ‘మాస్టర్‌’నే విడుదల చేయాలని థియేటర్‌ యజమానులు భావిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిర్ణీత తేదీ ప్రకారం సినిమా విడుదల కాలేని పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ‘మాస్టర్‌’ బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

Advertisement
Advertisement
Advertisement