Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 15:09:46 IST

Vijay Deverakonda: న్యూడ్ పోస్టర్ విడుదల నా ఆలోచనే.. కానీ కరణ్ జోహార్ మాత్రం..

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్(Liger)’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌‌లో చిత్రబృందం బిజీగా ఉంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది మూవీటీం. అందులో విజయ్ దాదాపు న్యూడ్‌గా ఉన్నాడు. ఆ పోస్టర్ వెనుక ఉన్న ఆలోచన గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడాడు.


విజయ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆ పోస్టర్‌ని విడుదల చేయడానికి వెనుకాడారు. దానికి కారణం ఇది చాలా సున్నితమైన అంశం అని ఆయన అభిప్రాయం. కానీ ప్రమోషన్స్ ఈ పోస్టర్‌తోనే ప్రారంభించాలని నేను అనుకున్నాను. అందుకే కరణ్‌తోపాటు మిగిలిన మూవీ టీంతో మాట్లాడాను. అప్పుడు వారు నువ్వు సరిగ్గా ఉన్నావా. ఇది చాలా సున్నితమైన అంశం. ఏదైనా తేడా వస్తే జనాలు విమర్శిస్తారు. అయిన మన సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి ఇలాంటివి అవసరం లేదని చెప్పారు.


కానీ నేను.. మీరు దాన్ని రిలీజ్ చేయకపోతే.. నేనే దాన్ని విడుదల చేస్తాను. కాబట్టి మీరే అఫిషియల్ పోస్టర్‌గా విడుదల చేయండి. నేను నా సోషల్ మీడియా పేజీలో ఉంచుతాను. ఇది నా చిత్రం. దాని కోసం ఇది అవసరం అని చెప్పాను. దాంతో అందరూ కన్విన్స్ అయ్యి సరేనని చెప్పారు’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.


విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా కొన్ని డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. నాకు బాగా ఎగ్జాయిటింగ్‌గా అనిపిస్తే వాటిని చేస్తాను. దాని గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. కాబట్టి, న్యూడ్ పోస్టర్ అనేది పూర్తిగా నా ఆలోచన మాత్రమే. అది నాకు నచ్చింది. కాబట్టి చేశాను’ అని తెలిపాడు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement