Abn logo
May 15 2020 @ 14:34PM

వెబ్ సిరీస్ ఆలోచ‌న‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో త‌నకంటూ ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. ప్ర‌స్తుతం ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న బ్యాన‌ర్‌లో వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించాల‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ బాధ్య‌త‌ల‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ‘దొర‌సాని’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కేవీఆర్ మ‌హేంద్ర‌కు అప్ప‌గించాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement