సూపర్ స్టార్‌కు పోటీగా రౌడీ హీరో..?

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పోటీగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడా..! ప్రస్తుతం అవుననే వార్త సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట' సినిమా రూపొందుతోంది. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక లావాదేవీల కుంభకోణాలు అనే యూనివర్సల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చేసిందని సమాచారం. ఇక ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్' లాంటి చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో ఈ పోటీలో దిగడం అంతమంచిది కాదనుకున్న మహేశ్ బృందం ఏప్రిల్ 1కు 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేసుకున్నారు. 

ఇది సోలో డేట్ అని ఇన్నిరోజులు భావించిన మేకర్స్‌కు 'లైగర్' షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో 'లైగర్' రూపొందుతోంది. తాజాగా, ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైందట. దాంతో త్వరలో పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్‌ను మొదలుపెట్టి ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలని పూరి టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు అస్తున్నాయి. ఇదే నిజమైతే మహేశ్ - విజయ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.  

Advertisement
Advertisement