శ్రీవారిసేవలో విజయ్‌ దేవరకొండ

ABN , First Publish Date - 2021-10-11T03:11:29+05:30 IST

తిరుమల శ్రీవారిని సినీ హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ (మిడిల్‌క్లాస్‌ మెలొడిస్‌ ఫేం) ఆదివారం దర్శించుకున్నారు

శ్రీవారిసేవలో విజయ్‌ దేవరకొండ

తిరుమల: తిరుమల శ్రీవారిని సినీ హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ (మిడిల్‌క్లాస్‌ మెలొడిస్‌ ఫేం) ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చిన విజయ్‌ దేవరకొండను చూసేందుకు పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. 

Updated Date - 2021-10-11T03:11:29+05:30 IST