Abn logo
Jan 20 2021 @ 16:54PM

నన్నెవరూ పట్టించుకోరనుకున్నా: విజయ్

`నా సినిమాలు చూడడానికి ఎవరైనా థియేటర్‌కు వస్తారా? నన్ను నటుడిగా గుర్తిస్తారా?` అని ఒకప్పుడు బాధపడేవాడినని, అలాంటిది `లైగర్` ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ విడుదల తర్వాత వచ్చిన స్పందన చూసి చాలా సంతోషపడ్డానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న `లైగర్` సినిమా పోస్టర్, ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు సందడి ప్రారంభించారు. 


`లైగర్` పోస్టర్లకు క్షీరాభిషేకాలు చేశారు. ఇది చూసిన విజయ్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. `అభిమానులే నా లవ్. `లైగర్` టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైన రోజున మీరు నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేశారు. `నా సినిమాలు చూడడానికి ఎవరైనా థియేటర్‌కు వస్తారా? నన్ను నటుడిగా గుర్తిస్తారా?` అని ఒకప్పుడు బాధపడేవాడిని. ఇప్పుడు మీ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయ`ని విజయ్ పేర్కొన్నాడు.   

Advertisement
Advertisement
Advertisement