Abn logo
Sep 16 2021 @ 03:07AM

విహారి..మళ్లీ హైదరాబాద్‌కు

హైదరాబాద్‌: టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి హైదరాబాద్‌ జట్టులో పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయాన్ని అతడు బుధవారం వెల్లడించాడు. ‘ఆంధ్ర క్రికెట్‌ సంఘాన్ని వీడుతున్నా. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఐదేళ్లుగా ఆంధ్రకు ఆడడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ క్రమంలో నాకు అండగా నిలిచిన సహచర ఏపీ క్రికెటర్లు, కోచ్‌లు, సంఘం ఆఫీసు బేరర్లకు కృతజ్ఞతలు’ అని హనుమ ఓ ప్రకటనలో తెలిపాడు. ‘వచ్చే సీజన్‌నుంచి హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని కూడా పేర్కొన్నాడు. తాను తిరిగి వచ్చే అంశమై విహారి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం పెద్దలతో చర్చించగా, వారు పునరాగమనాన్ని స్వాగతించినట్టు సమాచారం. మెరుగైన అవకాశాలకోసం 2015 సీజన్‌లో ఆంధ్రకు తరలి వెళ్లిన హనుమ అక్కడ నుంచే టీమిండియా టెస్ట్‌ జట్టుకు ఎంపికవడం గమనార్హం.