శభాష్‌ విహాన్‌!

ABN , First Publish Date - 2021-11-16T05:30:00+05:30 IST

ఒక టీంలో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల ఫొటోలు చూపిస్తే పేర్లు ఇట్టే చెప్పేస్తారు. అయితే ఏదైనా ఒక క్రీడకు చెందిన వంద....

శభాష్‌ విహాన్‌!

ఒక టీంలో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల ఫొటోలు చూపిస్తే పేర్లు ఇట్టే చెప్పేస్తారు. అయితే ఏదైనా ఒక క్రీడకు చెందిన వంద మంది ఆటగాళ్లను గుర్తుపట్టమంటే ‘అమ్మో మా వల్ల కాద’ని చేతులెత్తేస్తారు. కానీ కొత్తగూడెంకు చెందిన విహాన్‌ కార్తీక్‌ మాత్రం ఇట్టే గుర్తుపడతాడు.

 ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి లండన్‌లో ఉంటున్న అయిదేళ్ల విహాన్‌ వంద మంది అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారులను గుర్తుపడతాడు.

 ఫుట్‌బాల్‌ క్రీడాకారుల బొమ్మలు చూపిస్తుంటే చకచకా పేర్లు చెప్పేస్తుంటాడు. ఒకటిన్నర నిమిషం సమయంలోనే వంద మంది క్రీడాకారుల పేర్లు చెప్పేస్తాడు. విహాన్‌ తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.

Updated Date - 2021-11-16T05:30:00+05:30 IST