విమాన వాహనంపై విఘ్నేశ్వరుడు

ABN , First Publish Date - 2021-09-29T06:20:32+05:30 IST

కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు విమాన వాహనం (సప్పరం)పై భక్తులకు దర్శనమిచ్చారు.

విమాన వాహనంపై విఘ్నేశ్వరుడు
సప్పరంలో వినాయకుడు - ప్రాకారోత్సవంలో పాల్గొన్న ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఉభయదారులు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 28: కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు విమాన వాహనం (సప్పరం)పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవకు ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్ళై కుటుంబీకులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తేవడంతో ఆలయ అలంకార మండపంలో స్వామి ఉత్సవర్లకు పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామివారి ఉత్సవర్లను సప్పరంపై ఉంచి ప్రధాన ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌కుమార్‌డ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.


ప్రత్యేక ఉత్సవాల్లో నేడు

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వేలూరుకు చెందిన రాజమాణిక్యం నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు, కాణిపాకానికి చెందిన కె.రాధాకృష్ణ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. 

Updated Date - 2021-09-29T06:20:32+05:30 IST