Jun 28 2021 @ 18:23PM

నయన్‌తో ఎక్కడికైనా ఓకే: విఘ్నేష్ శివన్‌

త్వరలో పెళ్లి చేసుకుంటాం..

తనని చీరలో ఎక్కువ ఇష్టపడతా..

పాత్రలన్నీ తనే శుభ్రం చేస్తుంది! 

భవిష్యత్తు పైనే దృష్టంతా..

- విఘ్నేష్ శివన్‌

మోస్ట్‌ ఎలిజిబుల్‌ లేడీ బ్యాచ్‌లర్స్‌లో నయనతార ఒకరు. కొన్నేళ్లగా ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! అయితే పెళ్లి ఎప్పుడున్నది ఇప్పటి వరకూ ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. విఘ్నేష్ శివన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘సన్‌డే క్వశ్చన్స్‌ టైమ్‌’ అంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. నయన్‌తో సీక్రెట్‌గా తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. ఆ విశేషాలు మీ కోసం...


1. ఆన్‌లైన్‌లో అభిమానులతో మాట్లాడిన ప్రతిసారి నయనతార గురించే ఎక్కువ సంభాషణ జరుగుతుంది. మీరెలా ఫీలవుతారు. 

చాలా గర్వంగా ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయి గురించి మాట్లాడితే ఆనందమేగా! 

2. బాలీవుడ్‌లో డైరెక్షన్‌ ఆఫర్‌ వస్తే హీరోగా ఎవర్ని ఎంచుకుంటారు? 

రణ్‌బీర్‌ కపూర్‌తో చేస్తా. 

3. టైమ్‌ వెనక్కి వెళితే గడిచిన కాలంలో ఏ క్షణాన్ని మీరు ఆస్వాదించాలనుకుంటారు? 

నేను ఎప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించను. నా దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు పైనే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తుతోనే ట్రావెల్‌ చేయాలనుకుంటా. 

4. నయన్‌తో కలిసి ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు. 

తను పక్కన ఉంటే ఎక్కడికైనా ఇష్టమే! 

5. నయనతార నటించిన ‘నేత్రికన్‌’ విడుదల ఎప్పుడు? 

త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. 

6. నయన్‌ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మేమంతా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. ఇంకా ఆలస్యమెందుకు? 

పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం పెళ్లి కోసం డబ్బు దాచిపెడుతున్నాను. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక తప్పకుండా ఇద్దరం ఏడడుగులు వేస్తాం. 7. నయనతారకు మీరు ఇచ్చిన మొదటి బహుమతి? 

‘నాను రౌడీ దానే’ చిత్రంలో తంగమై పాట. 

8. మీ ప్రేయసిని ఏ డ్రెస్‌లో ఎక్కువగా ఇష్టపడతారు? 

తను నాకు చీరలోనే ఎక్కువగా నచ్చుతుంది. 

9. నయన్‌కి, మీకూ మధ్య ఉన్న ఓ రహస్యాన్ని చెప్పగలరా? 

ప్రతిరోజూ డిన్నర్‌ అయ్యాక మేం తిన్న పాత్రలన్నీ నయనతారనే శుభ్రం చేస్తుంది. తను చేేస వంటకాల్లో ఘీ రైస్‌, చికెన్‌ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. 

10. డెస్టినేషన్‌ కోసం వెళ్లే ప్రాంతం? 

ఈస్టరన్‌ స్పెయిన్‌లో ఇబిజా.

11. సంగీత దర్శకుడు అనిరుద్ తో మీకున్న అనుబంధం?

అనిరుద్ధ్‌ నాకు మంచి మిత్రుడు. నయనతార హీరోయిన్‌గా నేను దర్శకత్వం వహించిన ‘నాను రౌడీ దానే’ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టైమ్‌లో మా ఫ్రెండ్‌షిప్‌ మరింత బలపడింది. 

12. రజనీకాంత్‌ నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? 

బాషా. 


13. నెగిటివిటీని ఎలా ఎదుర్కొంటారు? 

అసలు దాని గురించి పట్టించుకోను. 

14. ఈ మధ్యకాలంలో థియేటర్‌లో చూసిన  కొత్త సినిమా? 

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ రూపొందించిన ‘99 సాంగ్స్‌’. ఆ థీమ్‌ నాకు బాగా నచ్చింది. 

15. మీరు ఇప్పటివరకూ చూసిన వ్యక్తుల్లో ది బెస్ట్‌ ఎవరు? 

నయన్‌ వాళ్లమ్మ మిసెస్‌ కురియన్‌.

16. మీ ఫేవరెట్‌ మలయాళ, తెలుగు నటులు? 

మోహన్‌లాల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు.

17. సింగపూర్‌లో మీకు నచ్చిన ప్రదేశం? 

క్లార్క్‌ క్వే

18. సమంత గురించి?

అందం, మనసు పరంగా అద్భుతమైన వ్యక్తి. 19. నయన్‌తార నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? 

రాజు రాణి

20. అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళతారు?

ప్రముఖ గాయనీమణులు లతా మంగేష్కర్‌, చిత్రగారు. 

21. మీరు సినిమాల్లోకి రావడానికి ఇన్స్‌పిరేషన్‌? 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమాన హీరో. ఆయనంటే నాకు ప్రాణం. సినిమాల్లోకి వచ్చి దర్శకుడిగా ఉన్నానంటే దానికి ఆయనే కారణం. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఉంది. 

22. ప్రేమకథలు కాకుండా వేరే జోనర్‌లో సినిమాలు చేయాలంటే ఏ తరహా కథ ఎంచుకుంటారు? 

సోషియో ఫాంటసీ, ఎమోషనల్‌ డ్రామా, సైన్స్‌ ఫిక్షన్‌ కథలు చేయాలనుకుంటున్నా.