Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూరగాయాలు!

 ఆకాశాన్నంటుతున్న ధరలు 

 విలవిల్లాడుతున్న వినియోగదారులు

లంకల్లో పంటలు తగ్గడమే ధరల పెరుగుదలకు కారణం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

నిత్యావసరమైన ఆకు, కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు వీటి ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న కార్తీక మాసంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధరల నుంచి అల్లం వరకు అన్ని నిత్యావసర కూరగాయల ధరలు తారస్థాయికి చేరు తున్నాయి. గోదావరి తీర గ్రామీణ లంక ప్రాంతాల్లో ఆకు, కాయగూరల సాగు గణనీయంగా తగ్గు తుండడం వల్ల ఉత్పత్తులు పడిపోయి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. మార్కెట్‌లో ఇప్పు డు ఉల్లి నుంచి ఆకు, కాయగూరల ధరలు రూ.40కు తక్కువ లేకుండా విక్రయిస్తున్నారు. పైగా కోన సీమ లంకలతోపాటు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వివిధ కాయగూరల పంటలు దిగుమతి అవుతున్నప్పటికీ ధరలు తగ్గకపోవడం వినియోగదారులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో ఉల్లిపాయలు క్వాలిటీ రకం కిలో రూ.60 పలుకుతోంది. ములక్కా యలు కిలో రూ.120, క్యాప్సికమ్‌ కిలో రూ.120, మామిడికాయలు కిలో రూ.120, చిక్కుడుకాయలు సైతం రూ.120 పలుకుతోంది. చింతకాయలు కిలో రూ.50, టమాటా, బీరకాయలు, బీట్‌రూట్‌, వంకా యలు కిలో రూ.60 వంతున విక్రయిస్తుండగా, క్యారెట్‌ కిలో రూ.80, అల్లం కిలో రూ.60 ధర పలుకుతోంది. పచ్చిమిర్చి, కాకరకాయలు, బెండకాయలు, క్యాబేజీ కిలో రూ.40 వంతున లభిస్తు న్నాయి. ఆనబకాయ రూ.30, బంగాళాదుంపలు కిలో రూ.30 వంతున విక్రయిస్తున్నారు. ముఖ్యంగా లంక ప్రాంతాల్లో కాయగూరల పంటలు ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే ధరలు చుక్కలను అంటుతు న్నాయి. మరోపక్క డీజిల్‌ రేట్లు పెరగడంతో పంటల సాగుకు ఆర్థికంగా పెనుభారం అవుతోంది. రానున్న రోజుల్లో పెట్టుబడులు పెట్టలేక రైతులు సాగుకు ముందుకు రాలేమని చెబుతున్నారు. దాంతో ఉత్పత్తులు తగ్గే పరిస్థితి ఉందని లంక గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. ఇటు కాయగూరల ధరలు విపరీతంగా పెరగడం వల్ల వినియోగదారులు కూడా విలవిల్లాడుతున్నారు. 
Advertisement
Advertisement