హై అలర్ట్‌.....

ABN , First Publish Date - 2020-09-22T05:47:51+05:30 IST

మావోయిస్టు వారోత్స వాల సందర్భంగా పోలీసుశాఖ జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రాణహిత తీరంతోపాటు అటవీ ప్రాం తాల్లో పెద్ద

హై అలర్ట్‌.....

మావోయిస్టు వారోత్సవాలు, ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీసుల కూంబింగ్‌

భాస్కర్‌ లేఖ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు శాఖ

ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు

జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ


మంచిర్యాల, సెప్టెంబరు 21: మావోయిస్టు వారోత్స వాల సందర్భంగా పోలీసుశాఖ జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించింది. ప్రాణహిత తీరంతోపాటు అటవీ ప్రాం తాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్‌  చేపడుతోంది. స్పెషల్‌ పార్టీలతో కలిసి పోలీసులు అడవులను జల్లెడ పడు తున్నారు. పక్క జిల్లా అయిన కుమరంభీం ఆసిఫాబా ద్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగి ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినందున మరింతగా అప్రమత్తమయ్యారు. జాగ్ర త్తగా ఉండాలంటూ మారుమూల పోలీస్‌స్టేషన్‌లకు హెచ్చరికలు జారీచేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారా యణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి ఆసి ఫాబాద్‌ జిల్లాలోనే మకాం వేయడం ప్రాధాన్యం సం తరించుకొంది. ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టు కీలక నేత భాస్కర్‌ త్రుటిలో తప్పించుకున్నట్లు పోలీ సులు భావిస్తున్నందున చుట్టుపక్కల జిల్లాల్లోని అట వీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడు తున్నారు. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఎప్పుడు  ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. 


భాస్కర్‌ లేఖతో అప్రమత్తం....

ఎన్‌కౌంటర్‌ బూటకమని, మావోయిస్టులు చుక్కా లు, బాజీరావులను పోలీసులు పట్టుకొని చంపారం టూ కీలక నేత భాస్కర్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేయ డంతో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణిచివేతకు ఎన్‌కౌం టర్‌ ఉదాహరణ అని, అరెస్టు చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదని, కార్డెన్‌ సెర్చ్‌ల పేరుతో ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని పేర్కొన డంతో పోలీస్‌శాఖలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎన్‌ కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టుల కిట్‌ బ్యాగుల్లో పలువురు సానుభూతిపరుల పేర్లు ఉన్నట్లు గుర్తిం చిన పోలీసులు వారిని విచారించేందుకు సిద్దపడటం తో జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇది లా ఉండగా ఇతర జిల్లాలకు చెందిన పోలీసు ఉన్న తాధికారులు సైతం జిల్లా సరిహద్దుల్లో పర్యటిస్తుం డటం ప్రాధాన్యం సంతరించుకొంది.  ఈ నెల 17న రామగుండం కమిషనరేట్‌ అదనపు డీసీపీ అశోక్‌కు మార్‌ దండేపల్లి మండలంలో పర్యటించి ఆసాంఘిక శక్తులకు ప్రజలు సహకరించవద్దని సూచించారు. తాజాగా సోమవారం పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ వేమనపల్లి మండలంలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. 


ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు....

ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌, భాస్కర్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు పోలీసులు భద్రతను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్షణ తప్పదని భాస్కర్‌ పేర్కొన్నందున ప్రజా ప్రతినిధులు అప్రమ త్తంగా ఉండాలని, మారుమూల ప్రాంతాలకు వెళ్లరా దని పోలీసులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితు ల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పోలీసు శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, తదితర సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  


భద్రత పెంచుతాం....డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి

జిల్లాలోని రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధు లు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రముఖుల భద్రతను మరింతగా పెంచుతాం. నాయకులు, ప్రజాప్రతి నిధుల కార్యక్రమాల షెడ్యూల్‌ వివరాలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచాలి. ప్రముఖుల దగ్గరకు కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పోలీసుశాఖకు ముందస్తు సమాచారం ఇస్తే అవసరమైన భద్రత చర్యలు చేపడతాం. 

Updated Date - 2020-09-22T05:47:51+05:30 IST