చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బృందం
తాడేపల్లిగూడెం రూరల్, మే 27: జగ్గన్నపేట మాలపాడు చెరువులో అక్రమ మైనింగ్ చేసిన చెరువును విజిలెన్స్ ప్రత్యేక బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ చేపట్టారనే అభియో గాలతో డీపీవో నాగలత, ఆర్డీవో దాసి రాజు, మైనింగ్ ఏడిఏ సుబ్రహ్మణ్యం తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక వీఆర్‌వో సుబ్బారావు, కార్యదర్శి బాలకృష్ణ నుంచి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభించారు. ఎన్ని రోజులు చేశారనే విషయాలపై ఆరా తీశారు. డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.