ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-08-18T05:20:23+05:30 IST

రాజంపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి సీజ్‌ చేశారు. పట్టణంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్‌, శ్రీనివాస ఫెర్టిలైజర్స్‌, బోయనపల్లెలోని కొన్ని దుకాణాలపై విజిలెన్స్‌ సీఐ పురుషోత్తం రాజు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు
రాజంపేటలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ పురుషోత్తం రాజు, సిబ్బంది

రాజంపేట, ఆగస్టు 17: రాజంపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి సీజ్‌ చేశారు. పట్టణంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్‌, శ్రీనివాస ఫెర్టిలైజర్స్‌, బోయనపల్లెలోని కొన్ని దుకాణాలపై విజిలెన్స్‌ సీఐ పురుషోత్తం రాజు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు దుకాణాలలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండ అధిక మొత్తంలో ఎరువులు అమ్ముతున్నారన్న ఆరోపణలపై దాడులు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దుకాణాల రికార్డులను పరిశీలించి 18.944 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలను సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. ఈ దాడులలో వ్యవసాయాధికారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

అమ్మకాలు నిలుపుదల

ఖాజీపేట, ఆగస్టు 17: ఖాజీపేటలోని శ్రీలక్ష్మీనరసింహ ట్రేడ్స్‌, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్‌లలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరుకు, రికార్డుల్లో తేడా ఉండటం వలన వరి, పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు కడప విజిలెన్స్‌ అధికారులు రామకృష్ణ, ఏవో బాలగంగాధర్‌, నాగార్చనలు తెలిపారు. కడప రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఉమామమహేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. రికార్డుల్లో, సరుకుల్లో వ్యత్సాం ఉందన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయించరాదన్నారు. అధిక ధరలకు అమ్మినట్లయితే సమాచారం అందించాలన్నారు. విచారణలో నిజమని తేలితే షాపులను సీజ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 


 

Updated Date - 2022-08-18T05:20:23+05:30 IST