రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా?

ABN , First Publish Date - 2022-05-21T03:22:29+05:30 IST

జిల్లాలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రెవెన్యూ అక్రమాలు, అవి నీతి లీలలపై విజిలెన్స్‌ విభాగం ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న నలుగురు తహసీల్దార్లపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుం డటంతో ఈ మేరకు కలెక్టర్‌ ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా?

- ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లకు చెందిన తహసీల్దార్లపై కలెక్టర్‌ సీరియస్‌

- భూ లావాదేవీల్లో అక్రమాలపై నిలదీత?

- పరిహారం పంపిణీలో అక్రమాలపై అంతర్గత విచారణ 

- రంగంలోకి దిగిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్‌

- నేరుగా బాధితులను కలిసి నచ్చజెప్పే యత్నం

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రెవెన్యూ అక్రమాలు, అవి నీతి లీలలపై విజిలెన్స్‌ విభాగం ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న నలుగురు తహసీల్దార్లపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుం డటంతో ఈ మేరకు కలెక్టర్‌ ఆ నలుగురిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికల్లో కాగజ్‌నగర్‌, ఆసిపాబాద్‌ డివిజన్లలో చోటు చేసుకుంటున్న రెవెన్యూ అక్రమాలు, అక్రమ భూ బదాల యింపులతో పాటు, ధరణిలో పేర్ల సవరణకు సంబంధించి రైతుల నుంచి పెద్దమొత్తంలో డిమాండు చేయటం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. అంతేకాదు జాతీయ రహదారి విస్తర ణకు సంబంధించి పరిహారంలో చోటుచేసుకున్న తారతమ్యాల అక్రమా లపై ఈనెల 6న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన పత్రికలో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. వీటిపైన అటు ఇంటెలిజెన్స్‌, ఇటు విజిలెన్స్‌ అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్టు రెవెన్యూ శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘ఆంధ్రజ్యోతి’ కథనం తర్వాత బాధి తులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తుండడంతో కలెక్టర్‌ భూసేకరణ అంశాలతో ముడిపడి ఉన్న సిబ్బందిని పిలిచి మందలించినట్టు తెలిసింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి బాధితులను బుజ్జగించే పనిలో తలము నకలైనట్టు బాధితుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా వాంకిడి నుంచి రెబ్బెన వరకు పలువురు బాధితులు ఇప్పటికే కలెక్టర్‌ను ఆశ్రయించి వీలైనంత త్వరగా తమ ఆర్బిట్రేషన్‌ వ్యవహారం తేల్చాలని కోరినట్టు చెబుతున్నారు. మొత్తం 126మంది బాధితులకు సంబంధించిన దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై నిర్ణయిం తీసుకుంటే తప్పా బాధి తులు తదుపరి న్యాయ సహాయం కోసం కోర్టులను ఆశ్రయించేందుకు వీలు లేదు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు బాధితులను బుజ్జగించి వారి అంగీకారం తీసుకోవాలని ఉన్నతాధికారులు అధికార యంత్రాంగాన్ని ఆదే శించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా తాజాగా శుక్రవారం రెవెన్యూ, నేషనల్‌ హైవే సిబ్బంది జిల్లాలో పర్యటించి నేరుగా బాధితులను కలిసి నోటిసులపై సంతకాలు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే మరోవైపు రెబ్బెనలో తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేతలు చేపట్టవద్దవంటూ రహదారి విస్తరణ పనులు అడ్డుకొని గ్రామస్థులంతా మంచిర్యాల-చంద్రాపూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దాంతో జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్‌ రవీందర్‌ రావు తన సిబ్బందితో కలిసి రెబ్బెన నుంచి వాంకిడి వరకు విస్తరణకు అడ్డంకిగా మారిన సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అంతేకాదు వాంకిడిలో నష్టపరిహారం సరిగ్గా లేదంటూ కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధి తులతో కలిసి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. 

ఆ నలుగురు తహసీల్దార్లపై నిఘా

ఇదిలా ఉంటే రెవెన్యూ శాఖలో నలుగురు తహసీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారీఅక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ఇంటలిజెన్స్‌ వీరిపై పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు, ముగ్గురు తహసీల్దార్లు భూముల రికార్డులను టాంపరింగ్‌ చేసి అక్రమార్కులతో చేతులు కలపటం ద్వారా, ఆ భూములను వారికి కట్టబెట్టి భారీ మొత్తంలో లబ్ధి పొందారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే ఒక్కరిద్దరు తహసీల్దార్లు భూ మాఫీయాతో చేతులు కలిపి భూముల మ్యూటేషన్లలో సానుకూలంగా సహకరించినందులకు రియల్‌ వ్యాపారుల నుంచి బినామీ పేర్లతో వాటాలు పొందినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న నలుగురు తహసీల్దార్లు రికార్డులను టాంపరింగ్‌ చేయడం, ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులకు కట్టబెట్టడం, రికార్డుల్లో సవరణల పేరుతో ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించడం వంటి అంశాల్లో అనుమానాస్పదంగా వ్యవహరించినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటు ఇంటిలిజెన్స్‌, ఇటు విజిలెన్స్‌ వివాదాలు ఇంచుమించు ఒకే రకమైన అభి ప్రాయాలు వ్యక్తం చేయడంతో కలెక్టర్‌ ఇటీవల ఓ సమావేశం సందర్భంగా ప్రత్యేకంగా నలుగురిని పిలిపించి తీవ్రంగా మందలించినట్టు రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇద్దరు తహసీల్దార్లు బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరిపై నేడో, రేపో శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-05-21T03:22:29+05:30 IST