ఆర్టీసీ స్టాల్స్‌లో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-20T05:11:40+05:30 IST

ఆర్టీసీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి ధర్మతేజ ఆదేశాల మేరకు నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులోని స్టాల్స్‌, ఇతర వ్యాపార సముదాయాల్లో బుధవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఆర్టీసీ స్టాల్స్‌లో విజిలెన్స్‌ తనిఖీలు
తనిఖీలు చేపడుతున్న విజిలెన్స్‌ అధికారులు

నెల్లూరు(క్రైం), జనవరి 19: ఆర్టీసీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి ధర్మతేజ ఆదేశాల మేరకు నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండులోని స్టాల్స్‌, ఇతర వ్యాపార సముదాయాల్లో బుధవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్న స్టాల్స్‌ యజమానులకు అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా జిల్లా చీఫ్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ జీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిర్దేశిత ధరలకు మాత్రమే స్టాల్స్‌లో వస్తువులు అమ్మాలని, గుట్కా, సిగిరెట్‌, బీడీ వంటి నిషేధిత ఉత్పత్తులను విక్రయించరాదని హెచ్చరించారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:11:40+05:30 IST