3.45 లక్షల కండోములను సీజ్ చేసిన పోలీసులు.. అసలు విషయం తెలిసి షాక్!

ABN , First Publish Date - 2020-09-25T02:51:51+05:30 IST

వాడేసిన కండోములను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠాను వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వేర్‌హౌస్‌పై దాడిచేసిన పోలీసులు

3.45 లక్షల కండోములను సీజ్ చేసిన పోలీసులు.. అసలు విషయం తెలిసి షాక్!

హనోయి: వాడేసిన కండోములను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠాను వియత్నాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వేర్‌హౌస్‌పై దాడిచేసిన పోలీసులు 360 కేజీల (3,45,000) బరువున్న వాడేసిన కండోములును స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వాడేసిన కండోములను సేకరించిన అనంతరం వాటిని వేడి నీటిలో శుభ్రం చేసి తిరిగి సరికొత్తగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, రీసైకిల్ చేసిన ఎన్ని కండోములను ఇప్పటి వరకు విక్రయించారనేదానిపై స్పష్టత లేదన్నారు. రీసైకిల్ చేసిన కండోములు ప్రతి కేజీకి 0.17 డాలర్ల చొప్పున లభిస్తున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న మహిళ తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-25T02:51:51+05:30 IST